స్మార్ట్ ఇండియా హ్యాకథాన్​-2020′ కార్యక్రమంలో విద్యా విధానం గురించి ప్రసంగించిన మోదీ

-

21వ శతాబ్దపు యువత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకునే నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. విద్యా వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్​-2020’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొని ప్రసంగించారు మోదీ.

‘స్మార్ట్ ఇండియా హ్యకథాన్​-2020’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ శతాబ్దం యువత ఆకాంక్షలకు అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినట్లు విద్యార్థులకు తెలిపారు. విద్యావ్యవస్థను అత్యంత ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగానే మార్పులు చేపట్టినట్లు పేర్కొన్నారు.21వ శతాబ్దాన్ని జ్ఞాన యుగంగా అభివర్ణించారు మోదీ. అభ్యాసం, పరిశోధన, ఆవిష్కరణలపై మరింత దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

1986నాటి జాతీయ విద్యావిధానం 1991 నాటికే ఔచిత్యం కోల్పోయిందన్న ఘాటు విమర్శల నేపథ్యంలో కొద్దిపాటి మార్పులు 1992లో చోటుచేసుకున్నా- అది అసమగ్ర కసరత్తుగానే మిగిలిపోయింది. అనంతర కాలంలో పొటమరించిన సమస్యలు ఎదురైన సవాళ్లను పరిగణనలోకి తీసుకుని సుదృఢ విద్యాసౌధం అవతరింపజేస్తామంటున్న నూతన విధానం- నేల విడిచి సాము గరిడీలు చేసిన మునుపటి అరకొర యత్నాలతో పోలిస్తే, ఎన్నో రెట్లు మెరుగ్గా గోచరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version