కరోనా టెన్షన్ : 8 45కి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం !

-

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో.. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం దృష్టి పెట్టాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తోంది. ఇవాళ్టి నుంచి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కూడా అమలు అవుతోంది. ఇక మరికాసేపట్లో మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

కోవిడ్-19 పరిస్థితులపై 8.45 గంటలకు ప్రధాని మోడీ ప్రకటన చేయనున్నారని అంటున్నారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్రాలకు కరోన లాక్ డౌన్ అమలు అధికారం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే లాక్ డౌన్ ఉండే అవకాశం లేదని గతంలో మోడీ ప్రకటించారు. మరి ఇప్పుడు ఎలాంటి ప్రకటన ఉంటుందో అనే టెన్షన్ అందరిలో నెలకొంది.

దేశవ్యాప్తంగా కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాని మోడీ గత మూడు రోజులుగా పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఆయన టీకా తయారీదారులతో కూడా సమావేశం నిర్వహించారు. గత నాలుగు రోజులుగా దేశం రోజుకు 2.5 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండడం సంచలనం రేపుతోంది. ఢిల్లీ, , మహారాష్ట్ర లాక్డౌన్ లాంటి ఆంక్షలు విధించాయి. ఢిల్లీ లో  6 రోజుల లాక్ డౌన్ పూర్తి కాగా, బుధవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version