బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు : మోడీ

-

ప్రధాని మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ వేదికగా.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ట్విట్టస్త్రాలు సంధించారు మోడీ. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ‘‘ రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను మహబూబ్‌నగర్‌లో @BJP4Telangana ర్యాలీలో ప్రసంగిస్తాను. అసమర్థ బీఆర్‌ఎస్‌ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ప్రజలు కాంగ్రెస్‌పై కూడా అంతే అవిశ్వాసంతో ఉన్నారు . BRS, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని వంశపారంపర్య పార్టీలు.’’ అంటూ మోడీ ఎద్దేవా చేశారు.

‘‘ మహబూబ్‌నగర్‌లో రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను రూ. 13,500 కోట్లకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నాను. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ’’ అని ప్రధాని ఆకాంక్షించారు.

మరోవైపు రేపటి ప్రధాని మోడీ పర్యటనకు మరోసారి సీఎం కేసీఆర్ దూరంగా వుండనున్నారు. ఆయనకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఇంకా కోలుకోనందునే కేబినెట్ సమావేశం కూడా వాయిదాపడిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version