వైసీపీ అనుబంధ విభాగం వాళ్ళు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారు : లోకేష్‌

-

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేశ్ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నోటీసుల అంశంపై స్పందించారు. “సీఐడీ అనేది వైసీపీ అనుబంధ విభాగంగా మారిపోయింది. లేని కేసులు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకువచ్చి కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అనేదే లేదు… కానీ పెద్ద కుంభకోణం జరిగినట్టు చిత్రీకరిస్తున్నారు. అందులో నాపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సీఐడీ అధికారులు నా వద్దకు వచ్చినప్పుడు… “మేం ఢిల్లీకి వస్తే లోకేశ్ కనబడడంలేదు, లోకేశ్ అక్కడున్నాడు, ఇక్కడున్నాడు” అంటూ మీరు ఎందుకు మాట్లాడారని వాళ్లను అడిగాను.

అందుకు వాళ్లేమన్నారంటే… మేం ఈ ఉదయమే విమానంలో ఢిల్లీ వచ్చాం. నేరుగా మీ వద్దకే వచ్చి నోటీసులు ఇస్తున్నాం… అంతేతప్ప, మీ కోసం ఇంతకుముందెప్పుడూ మేం ఢిల్లీకి రాలేదు అని వాళ్లు కూడా స్పష్టంగా చెప్పారు. డీజీపీ పైన సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తప్పు జరుగలేదు.. కుంభకోణం జరుగలేదు.. ఏనాడూ తప్పు చేయలేదు మేము.. వాళ్ళ లాగా క్విడ్ ప్రోకో చెయ్యలేదు.. అక్టోబర్ 4వ తారీఖున వంద శాతం సీఐడీ అధికారుల ముందు హాజరవుతాను అంటూ ఆయన పేర్కొన్నారు. మాకు వాయిదాలు అడిగే అలవాటు లేదు.. ఇవి దొంగ కేసులు.. ఎలాంటి ఆధారాలు లేవు.. మేం పారిపొం..సీఐడీ అధికారులు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారు.. ఈ కేసులన్నీ కక్ష్య సాధింపే.. ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు అని లోకేశ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version