రైనాకు మోడీ లేఖ.. ధన్యవాదాలు తెలిపిన సురేష్ రైనా…!

-

ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు టీమ్​ఇండియా క్రికెటర్ సురేశ్ రైనా. ధోనీ వీడ్కోలు పలికిన అరగంటకే తానూ ఆటకు గుడ్​బై చెప్పాడు. అయితే భారత జట్టుకు చేసిన సేవల్ని కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ వీరిద్దరికి లేఖ రాశారు. అందులో తన మనసులోని భావాల్ని పంచుకున్నారు.

raina-modi

“రైనా.. నువ్వు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నావు. కానీ దానిని నేను రిటైర్మెంట్‌ అనే పదంతో పిలవలేను.. ఎందుకంటే ఇంకా నీకు ఆడే సత్తా ఉంది.. యంగ్​ అండ్‌ ఎనర్జిటిక్‌ ప్లేయర్‌గా కనిపించే నువ్వు ఇంత త్వరగా ఆటకు వీడ్కోలు పలుకుతావని ఊహించలేదు. ఏది ఏమైనా నీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ సజావుగా సాగాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకాలం భారత క్రికెట్‌కు అద్భుతమైన సేవలందించావు. ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడావు” అంటూ పేర్కొన్నారు మోదీ.తాజాగా మోదీ రాసిన లేఖపై స్పందించాడు రైనా. లేఖ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపాడు. “మేము ఆడేటప్పుడు దేశం కోసం చెమట, రక్తం చిందిస్తాం. దేశ ప్రధానితో పాటు, ప్రజలు మా ప్రదర్శనను మెచ్చుకోవడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. మీరిచ్చిన ఈ సందేశాన్ని కృతజ్ఞతతో అంగీకరిస్తున్నా. జైహింద్” అంటూ రాసుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version