ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, ఆ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి మహ్మద్ నబీ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని నబీ శుక్రవారం స్వయంగా తన ట్విటర్ లో పేర్కొన్నాడు. మా టి20 వరల్డ్ కప్ ప్రయాణం నేటితో ముగిసింది. ప్రపంచ కప్ లో మాకు వచ్చిన ఫలితాలు మాకు కానీ, మా మద్దతు దారులకు కానీ నచ్చలేదు. ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పకుంటున్న.
ఒక సంవత్సరం నుంచి మా జట్టు సన్నద్ధత కెప్టెన్ కోరుకునే స్థాయికి లేదా పెద్ద టోర్నమెంట్ కు అవసరమైన స్థాయిలో లేదు. పైగా, గత కొన్ని పర్యటనలలో జట్టు మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ, నేను ఒకే పేజీలో లేము. ఇది జట్టు బ్యాలెన్స్ పై ప్రభావాన్ని చూపింది. అందుకే కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవడంలో ఇదే సరైన సమయం అని భావించా. ఇదే విషయాన్ని మేనేజ్మెంట్ కు తెలిపాను అని మహ్మద్ నబీ పేర్కొన్నారు.