తన పేరుని కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, అలాంటి చర్యలని అస్సలు ఉపేక్షించేది లేదని విలక్షణ నటుడు నిర్మాత మోహన్ బాబు చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేశారు తన పేరుని అనవసరంగా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. కొందరు నా పేరుని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని నా దృష్టికి వచ్చిందని దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరుని వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
మనం అనేక రకాల భావావేశాలతో వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సహాయపడటం లోనే మనం దృష్టి పెట్టగలగాలి. సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలోకి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని అన్నారు. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఎక్స్ వైదికగా మోహన్ బాబు పోస్ట్ చేశారు ప్రస్తుతం మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణు తో కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు.