వారసుడి కోసం కథలు వింటున్న బాలయ్య..నిజమేనా…!

-

టాలీవుడ్‌లో మళ్లీ షూటింగుల హంగామా మొదలైపోయింది. అలాగే బాలక్రిష్ణ అభిమానుల్లో ప్రశ్నలు కూడా మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికైనా ఆ అనౌన్స్‌మెంట్‌ వస్తుందా.. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య గుడ్‌ న్యూస్ చెప్తాడా అని ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలక్రిష్ణ కథలు వింటున్నాడని, డైరెక్టర్లతో మాట్లాడుతున్నాడని ఇలా చాలా వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ లాంచింగ్‌ గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో బాలయ్య అభిమానుల్లో కొత్త కొత్త డౌట్స్‌ వస్తున్నాయి.

జూ.ఎన్టీఆర్ 18 ఏళ్లకే హీరో అయిపోయాడు. ట్వంటీస్‌లో సూపర్‌ స్టార్డమ్‌ తెచ్చుకున్నాడు. అయితే మోక్షజ్ఞ 26 ఏళ్లు వచ్చినా ఇంకా తెరపైకి రాట్లేదు. ఫారెన్‌లో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్స్‌ చేస్తున్నాడని, అయిపోగానే సినిమా అని కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఇక లాక్‌డౌన్‌లో అయితే బాలక్రిష్ణ కొడుకు కోసం కథలు కూడా వింటున్నాడనే మాటలు వినిపించాయి. కానీ అన్‌లాక్‌ 5.ఓ వచ్చినా వారసుడి లాంచింగ్‌ గురించి మాట్లాడట్లేదు బాలయ్య.

మోక్షజ్ఞ కరోనా తర్వాతైనా సినిమాల్లోకి వస్తాడా.. లేక తండ్రి పొలిటికల్ వారసత్వాన్ని అందుకుని రాజకీయాల్లోకి వెళ్లిపోతాడా.. బావ లోకేష్‌తో కలిసి పార్టీ బాధ్యతలు చూసుకుంటాడా అని సినీజనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. మరి బాలయ్య ఏం ఆలోచిస్తున్నాడు. మోక్షజ్ఞని తెరపై చూడాలని తెగ ఆరాటపడుతున్నారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version