రైతుల అకౌంట్లో డబ్బులు.. వచ్చాయో లేదో ఇలా చూడండి..!

-

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. మోదీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సంవత్సరానికి రూ.6,000 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే రూ.6 వేలను ప్రభుత్వం ఒకేసారి అందించదు. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాలో పడుతాయని కేంద్ర స్పష్టం చేసింది.

raithu

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటివరకు దాదాపు 11.17 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకంలో చేరాలని భావించే వాళ్లు ఎవరైనా ఉంటే చేరవచ్చని కేంద్రం వెల్లడించింది. ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా పథకంలో చేరే సదుపాయాన్ని కల్పించింది. కాగా, అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతులు అధిక సంఖ్యలో ఈ పథకంలో చేరాలని కేంద్రం ప్రకటించింది.

ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రైతులకు ఆరు విడుతల ద్వారా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసింది. ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఆరో విడతలుగా డబ్బులను జారీ చేశారు. ఇప్పటికే ఈ డబ్బులు చాలా మంది రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే మీకు డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పులు ఉన్నా అక్కడే తెలుస్తుందని కేంద్రం తెలిపింది.

రైతులకు డబ్బులు రాకపోతే ఫొన్ నంబర్ : 011-24300606 కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ కాకపోవడం, లేదంటే ఆధార్ కార్డులో బ్యాంక్ అకౌంట్‌లో పేరు వేర్వేరుగా ఉండటం వంటి తప్పులను ఆన్ లైన్ లో సరిచేసుకోవచ్చు. ఈ కారణాల వల్ల కూడా డబ్బులు రావడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version