రేవంత్ రెడ్డిని గట్టిగా కోరుకుంటున్నారుగా!!

-

ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీకి కాస్త వ్యతిరేకత ప్రజల్లో స్టార్ట్ అయ్యిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట! హైదరాబాద్ వరకూ తెరాస బలంగా ఉన్నప్పటికీ జిల్లాల్లో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బట్టకట్టడానికి ఇది సరైన సమయమనేది ఒక వర్గం నేతల మాట! ఈ సమయంలో కాంగ్రెస్ కు ఉన్న మైనస్ లు ఏమిటి.. వాటిలో ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోవాల్సిన స్టెప్ ఏమిటి అనే అంశాలపై ఆన్ లైన్ లో ఒక సర్వే జరిగింది!

అవును… కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అన్నీ ఉన్నా ఏదో లేదన్నట్లుగా తయారయ్యిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. తెరాసది తెలంగాణలో వాపు మాత్రమే.. కానీ గ్రౌండ్ లెవెల్ లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నది అనేది టి.ప్రజల్లో కాంగ్రెస్ అభిమానుల మాటగా ఉంది! ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో మనస్పర్ధలు, లోకల్ పాలిటిక్స్ కు తావులేకుండా.. అంతా ఏకతాటిపై ఉంటే కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉంటాయనేది వారి అభిప్రాయంగా ఉంది!

ఈ విషయంలో “ఎవరిని టిపీసీసీ అధ్యక్ష పదవి వరిస్తే కాంగ్రెస్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది” అని ఆన్ లైన్ వేదికగా ఒక ప్రశ్న హల్ చల్ చేస్తుంది! ఈ విషయంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెద్ది, జగ్గారెడ్డి మొదలైన పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ… ప్రముఖంగా పోటీ మాత్రం రేవంత్ – కోమటిరెడ్డి ల మధ్య ఉందనేది అంతా చెబుతున్న మాట. ఈ విసయంలో జరిగిన సర్వేలో… రేవంత్ రెడ్డికే టిపీసీసీ చీఫ్ పదవి కట్టబెడితే… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బాగుంటుందనేది సుమారు 75శాతం మంది నెటిజన్లు చెబుతున్న మాట!! మరి సోనియా కూడా ఇదే దిశగా ఆలోచిస్తారా లేక మరో వ్యూహాత్మక తప్పిదం చేస్తారా అనేది వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version