ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్‌లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్‌లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. అటు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం రేపింది. ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు అక్కడి అధికారులు. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో 4 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 3, ఢిల్లీలో ఒక మంకీపాక్స్ కేసు గుర్తించారు అధికారులు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది.