భారత్‌లోని రైతులు రుతుపవనాల వర్షాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఈ నేపథ్యంలో ఏపీకి నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.నైరుతి రుతుపవనాలు జూన్ 5లోపు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రీ మాన్సూన్ వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. 2-3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. కాగా, మన దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పేర్కొంటారు.