రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దారుణం జరిగింది. కూతురు శారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఏనుగందుల భాస్కర్, లావణ్య(40) అనే దంపతులకు కూతురు సాన్వీ, కొడుకు రిషిక్ అనే ఇద్దరు పిల్లలు ఉండగా, ఇటీవల కూతురి శారీ ఫంక్షన్ చేసారు తల్లిదండ్రులు.

శారీ ఫంక్షన్ ఘనంగా చేద్దామని భార్య అడగగా, గృహప్రవేశం ఉందని తక్కువ ఖర్చులో చిన్నగా చేసాడు భర్త. దీంతో మనస్తాపంతో ఆదివారం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న లావణ్య ఘటన హాట్ టాపిక్ అయింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.