భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా ఉందా? తక్షణ ఉపశమనం కోసం సులభమైన చిట్కాలు ఉన్నాయని మీకు తెలుసా? అవునండి మీరు వింటున్నది నిజమే మనం తరచూ ఎదుర్కొనే సాధారణ సమస్య ఇది. ఎక్కువగా తినడం, వేగంగా తినడం లేదా, కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలా జరగవచ్చు. కడుపు ఉబ్బరం వల్ల అజీర్ణం, గ్యాస్ అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సులభమైన చిట్కాలు పాటించడం ద్వారా ఈ అసౌకర్యం నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. కడుపు ఉబ్బరం తగ్గించడానికి కొన్ని ప్రభావంతమైన చిట్కాలు తెలుసుకుందాం..
గోరువెచ్చని నీరు : భోజనం తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది ఇది ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కడుపులో గ్యాస్ ఉబ్బరం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మీరు కావాలంటే ఆ వేడి నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు.

చిన్నగా నడవడం: భోజనం తర్వాత అరగంట పాటు నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. నడవడం వల్ల కండరాలు కదులుతాయి ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
వజ్రాసనం వేయడం : వజ్రాసనం అనేది భోజనం తర్వాత సులభంగా వేయగలిగే ఒక యోగ ఆసనం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం కల్పిస్తుంది.
పుదీనా, అల్లం టీ : పుదీనా, అల్లం జీర్ణ వ్యవస్థ కు చాలా మంచిది. భోజనం తర్వాత పుదీనా లేదా అల్లం టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ అసౌకర్యం తగ్గుతుంది. కాసిని గోరువెచ్చని నీటిలో అల్లం ముక్కని వేసి బాగా మరిగిన తరువాత వడగట్టి తాగవచ్చు.
కడుపు ఉబ్బరం అనేది చాలా సాధారణ సమస్య కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే దాని నుండి సులభంగా బయటపడవచ్చు. మీరు భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీరు తాగడం, నెమ్మదిగా నడవడం వజ్రాసనం వేయడం, పుదీనా అల్లం టీ తాగడం వంటి చిట్కాలను పాటించడం ద్వారా కడుపు ఉబ్బరం అజీర్ణం నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మీరు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటుంటే భోజనంలో ఏ మార్పులు చేసుకోవాలో తెలుసుకోవడానికి ఒక డాక్టర్ని సంప్రదించండి.