ఈ నెల 14న సంత్ సేవాలాల్ గుడికి కాలినడకన వెళ్లి తిరుగు ప్రయాణంలో రాత్రి జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో బస చేసిన వివాహితపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గొల్ల కుంట గ్రామానికి చెందిన దంపతులు విద్యాపీఠంలో రాత్రి నిద్రించారు. అదే రోజు అక్కడ పెయింటర్ గా పనిచేస్తున్న తమిళనాడు వాసి మాధవన్ (34) విద్యాపీఠంలో సేదతీరుతున్న ఆ వివాహితపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడని రిమాండ్‌కు తరలించినట్లు సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ తెలిపారు.