కసాయి తల్లి : ప్రియుడి కోసం కన్న బిడ్డలనే..!

-

మానవత్వం మంటకలిసిపోతుంది. అమ్మ అనే పదానికి అర్ధం లేకుండా పోతుంది. కడుపున పుట్టిన పిల్లలని కన్న తల్లే కడతేరుస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఓ మహిళ, తన అక్రమ సంబధానికి కన్న బిడ్డలే అడ్డుగా ఉన్నారని భావించి వారిని అతి కిరాతకంగా హత్యమార్చింది. ఈ విషాద ఘటన సూర్యాపేటలోని మినీ ట్యాంక్ బండ్ ఏరియా చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సింగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన నాగమణికి ఇద్దరు బిడ్డలు (కుమార్తె మాధవి (9), కుమారుడు హర్షవర్ధన్‌ (6)) ఉన్నారు. అయితే తరచూ ఈమెకి భర్తతో గొడవలు జరుగుతుండేవి. నిత్యం ఈమెను భర్త వేధింపులకి గురి చేస్తుండేవాడు. ఆ క్రమంలో సూర్యాపేటకు చెందిన గట్టు మధు అనే ఆటో డ్రైవర్‌తో నాగమణికి అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త వేధింపులకు గురిచేస్తుండటంతో నాగమణి పిల్లలను అడ్డుతొలగించుకొని, అవివాహితుడైన మధును వివాహం చేసుకోవాలని పథకం రచించింది. పథకం ప్రకారం పిల్లల్ని తీసుకొని సూర్యాపేట సద్దుల చెరువు కట్టపైకి చేరుకుంది. పిల్లల్ని అందులో తోసేసి చంపేసింది. అనంతరం అక్కడి నుంచి ప్రియుడితో పరారైంది. మొదట్లో అందరూ భర్త వేధింపులు బరించలేక పిల్లలతో కలిసి నాగమణి ఆత్మహత్య చేసుకుందని భావించారు. కాని చెరువులో పిల్లల మృతదేహాలు మాత్రమే దొరకడంతో కొంచం అనుమానం మొదలైంది. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం తెలిసిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడితో పారిపోయిన నాగమణిని పట్టుకున్నారు. చేసేదేమి లేక ఆమె నిజం ఒప్పుకుంది. తన ప్రియుడు తన కోసం ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంట్లో పిల్లలు ఉండటం చూసి నిరుత్సాహ పడుతున్నాడాని, అతని సలహా మేరకే పిల్లని చంపేశానని చెప్పింది. దీంతో పోలీసులు అతన్ని కూడా పట్టుకొని స్టేషన్‌కి తెచ్చారు. కేసు రాసి ఇద్దర్నీ అరెస్టు చేసి… రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version