మొబైల్స్ తయారీదారు మోటోరోలా భారత్ కొత్తగా మోటో జి 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. మోటోరోలా నుంచి విడుదలైన లేటెస్ట్ మిడ్ రేంజ్ 5జి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 5జి ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉండగా.. బడ్జెట్ ధరకు లభిస్తున్న 5జి ఫోన్ కూడా ఇదే కావడం విశేషం.
ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 750జి 5జి ప్రాసెసర్‌ను అమర్చారు. 6జీబీ ర్యామ్ ఉంది. ఆండ్రాయిడ్ 10ఓఎస్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫోన్‌కు వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, దానికి తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ ఉంది. డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. దీనికి టర్బో పవర్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
మోటో జి 5జి స్పెసిఫికేషన్స్…
* 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 750జి ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 10, అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 11
* 48, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 52 వాటర్ రెసిస్టెన్స్
* 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్
మోటో జి 5జి స్మార్ట్ ఫోన్ వల్కనిక్ గ్రే, ఫ్రాస్టెడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్ ధర రూ.20,999గా ఉంది. దీన్ని డిసెంబర్ 7వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్ పై రూ.1000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.