హను రాఘవపూడితో సినిమా.. ప్రభాస్ నయా లుక్ రివీల్

-

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజాసాబ్’ షూటింగ్‌లో ఫుల్ బిజీ అయ్యాడు. అయితే, ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనదైన ప్రేమ కథలతో తెలుగు ప్రేక్షకుల మనుసులు గెలుచుకున్న హనురాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇటీవలే సినిమా ప్రారంభ పూజ కార్యక్రమం సైతం భారీగా జరిగింది.ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ప్రభాస్ ముంబైకు వెళ్లినట్లు తెలిసింది. దీనికి సంబందించి సోషల్ మీడియాలో ప్రభాస్ న్యూ లుక్ రివీల్ అయ్యింది.ప్రభాస్ కొత్త లుక్‌ను చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే వీడియో తెగ షేర్ అవుతోంది. ఆ వీడియోలో ప్రభాస్ మాస్క్ పెట్టుకొని తన ఫేస్‌ను కవర్ చేసుకున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ తొలి షెడ్యూల్ తమిళ‌నాడులోని మ‌ధురైలో జ‌రుగుతుండగా.. అక్టోబర్‌లో ప్రభాస్‌తో సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.

https://x.com/goutham4098/status/1837726243975749711?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1837726243975749711%7Ctwgr%5E040645cc915f98cefe0936e556fb1bfbe3ad3145%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.dishadaily.com%2Fmain.jsp

Read more RELATED
Recommended to you

Latest news