తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డం పడ్డారని రేవంత్ రెడ్ది విమర్శిస్తున్నారు.. ఆయన ఎట్ల అడ్డం పడ్డారో చెప్పు అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. నువ్వు ప్రధాని మోడీని కలిశావు కదా.. నీ ఆఫీసర్లను నాతో పంపు. కిషన్ రెడ్డిని వెంట బెట్టుకుని వారిని తీసుకెళ్తా.. ఎలా అడ్డం పడ్డారో చూద్దాం. ప్రాజెక్టులకు నువ్వు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇస్తున్నావా.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన నిధులు ఇస్తున్నావా.. అవన్నీ మీరు చేశాక మోడీ ఏమివ్వలేదు? కిషన్ రెడ్డి ఎక్కడ అడ్డం పడ్డారనేది చూద్దాం అన్నారు.
ఇక కిషన్ రెడ్డికంటే చిన్నోడు సీఎం అయ్యాడని కడుపు మంట అని అంటున్నావు. నేను నీ కంటే చిన్నోడినే కదా. దేశంలో ఏ రాష్ట్రానికి మోడీ ఎక్కువ చేయడు.. తక్కువ చేయడు. మూసీ ప్రక్షాళన డీపీఆర్ ను ఇవ్వు.. అఫీసర్లను అప్పజెప్పు. అది చూడకముందే చెబుతున్నా.. తప్పుల తడకగా అది ఉంటది. పనికిమాలిన రాజకీయం, సొల్లు రాజకీయాలు చేయడం తప్పా ఏమీలేదు. కాంగ్రెస్ నేతలు వస్తే మహిళలు చీపుర్లు తిరగేస్తున్నారు. కానీ మోడీ పాలనలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగదు అని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.