తెలంగాణాలో రాజకీయాల్లో జోరందుకున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవిని బీజేపీ అధిష్టానం మార్చేసింది… నిన్నటి వరకు బండి సంజయ్ చీఫ్ గా ఉండగా, ఇప్పుడు ఆయన స్థానంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని నియమించింది. దీనితో ఆయనకు తెలంగాణ బీజేపీ నేతల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఈయన తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… కిషన్ రెడ్డిని అధ్యక్షడిగా చేయడం సరైన నిర్ణయం అని అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించారు. ఇంకా అరవింద్ మాట్లాడుతూ తెలంగాణ బీజేపీకి కిషన్ రెడ్డి లక్కీ హ్యాండ్ అన్నారు.ఇంకా మాజీ చీఫ్ బండి సంజయ్ గురించి మాట్లాడుతూ .. అతనికి నాకు మధ్యన ఎటువంటి విబేధాలు లేవని తేల్చి చెప్పాడు.
బీజేపీకి కిషన్ రెడ్డి లక్కీ హ్యాండ్ : ఎంపీ అరవింద్
-