కిషన్ రెడ్డి సారథ్యంలో పార్టీ అధికారంలోకి వస్తుంది : రఘునందన్‌ రావు

-

బీజేపీ అధిష్టానం నేడు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సారథిగా నియమించబడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించబడిన ఈటల రాజేందర్ కు ఆ పార్టీ సీనియర్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఢిల్లీలో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడిన మాటలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం మంగళవారం పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణ బాధ్యతలు కిషన్ రెడ్డికి, ఏపీ బాధ్యతలు పురంధేశ్వరికి అప్పగించారు.

‘తెలంగాణ బీజేపీ సారథిగా నియమించబడిన కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు. బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ బాగా పని చేసింది. ఇప్పుడు
కిషన్ రెడ్డి సారథ్యంలో పార్టీ అధికారంలోకి వస్తుంద’ని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ కోసం ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా
నియమించబడిన ఈటలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version