OG సినిమా టికెట్ ధరలపై వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. OG సినిమా టికెట్ ధరల పెంపు దారుణమన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ప్రభుత్వం ఉంది కదా అని సినిమాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

మీరు ఏమైనా కాలపెట్టుకోండి రైతులను మాత్రం ఆదుకోండి డిమాండ్ చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఉల్లి పంటకు విపత్తు రాలేదని…. పంటను తెచ్చి అమ్ముకోబోతే గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడ్డారని వెల్లడించారు. అప్పటికప్పుడు జగన్ గారిని పిలిపిస్తామని చెబితే ప్రభుత్వం రూ.1,200 మద్దతు ధర ప్రకటించిందన్నారు. ప్రకటన చేసి కూడా ఉల్లి కొనకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని… హెక్టారుకు 50వేలు ఇస్తామంటున్నారు. అంటే ఎకరాకు రూ.20వేలు మాత్రమే ఇస్తూ రైతులను అన్యాయం చేస్తారా? అంటూ ఆగ్రహించారు.