ఇంటర్ విద్యార్థులకు ఎంపీ ఈటల కీలక సూచన.. ఆ సినిమా చూడండి!

-

రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఈనెల 22న విడుదల కానున్నాయి. అదే రోజు ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు.ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఆదివారం మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటర్ విద్యార్థులకు సోషల్ మీడియా వేదికగా కీలక సూచన చేశారు. ‘ఇంటర్ ఫలితాలు అనుకున్నట్టు రాకపోతే విద్యార్థులు మనస్తాపానికి, ఆందోళనకు గురికావొద్దన్నారు. ఒక్క పరీక్ష ఫలితమే అంతిమం కాదని, ఒక్కసారి ఫలితం అనుకూలంగా రాకపోతే, జీవితమే ముగిసిపోయిందనే భావన ఉండరాదన్నారు. జీవితంలో అవకాశాలు ఎన్నో వస్తాయని.. తిరిగి విజయం సాధించవచ్చన్నారు. 12th ఫెయిల్ అని OTTలో ఒక సినిమా ఉంది చూడాలని, అపజయం కూడా విజయానికి మెట్టు లాంటిదే అని.. ఎక్కుతూ పోవాలి తప్ప కుంగి పోవద్దని అని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news