భార్య వేధింపులు తాళలేక బెంగళూరుకు చెందిన అతుల్ సుభాశ్ ఆత్మహత్య ఘటన మరవకముందే దేశవ్యాప్తంగా భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. ఇటీవల భార్యల వేధింపుల కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ ఘటనలన్నీ మరవకముందే మహిళ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. మహారాష్ట్రలోని నాసిక్ లో ఓ ఐటీ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే..?
కాబోయే భార్య వేధింపులు తట్టుకోలేక ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హరేరామ్(36)కు, వారణాసికి చెందిన మోహినికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. అయితే ఓరోజు మోహిని.. తన లవర్ ను హగ్ చేసుకోవడం హరేరామ్ చూశాడు. తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని వేరే వ్యక్తిని కౌగిలించుకోవడం ఏంటి నిలదీశాడు. అయితే ఈ విషయం బయటపెడితే హరేరామ్ తో పాటు, అతడి కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని మోహిని బెదిరించడంతో అతడు మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరేరామ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఆ యువతి, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.