బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత కూడా ఆమె ఓటు పదేళ్లు ఉందని బాంబు పేల్చారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ లో కూడా ఒకే ఇంట్లో 72 ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని నేను సోషల్ మీడియాలో కూడా పెట్టానన్నారు.

2018, 2023 ఎన్నికల్లో నేను లక్షా 20 వేల నకిలీ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని… ఇప్పటికీ హైదరాబాద్ లో ఫేక్ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. నేను ఎవరికీ ఫుట్బాల్ ఇవ్వలేదని… రేవంత్ రెడ్డి ఫుట్బాల్ చాలా బాగా ఆడతాడని చురకలు అంటించారు. ఆయనతో ఎలా ఫుట్బాల్ ఆడాలో నేను జస్ట్ చూయించాను… నేను బీజేపీ అగ్రనేతలకు ఫుట్బాల్ ఇచ్చినట్లు ఫోటోలు ఉన్నాయా? అని ప్రశ్నించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.