తప్పు చేయకుంటే ఐటీ దాడులంటే ఎందుకు భయం : ఎంపీ లక్ష్మణ్

-

రాష్ట్రంలో తప్పు చేయని వారు ఐటీ దాడులంటే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ప్రశ్నించారు. సాధారణంగా జరిగే ఐటీ దాడులకు టీఆర్ఎస్ నేతలు రాజకీయాన్ని ముడిపెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక టీఆర్ఎస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కక్షతోనే బీఎల్ సంతోష్‌ను ఇబ్బంది పెడుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు.

“ప్రభుత్వం ఎవరో నలుగురి పేర్లు పెట్టుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మేం రాజకీయంగా, న్యాయంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో జీవనోపాధికి వచ్చిన 26 కులాలను ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించింది. తూర్పు కాపు, కొప్పుల వెలమ వంటి కులాలను తొలగించారు. ఈ 26 కులాల పూర్వీకులు 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉత్తరాంధ్ర కావడం వల్లే వారిని జాబితా నుంచి తొలగించారు. తొలగించిన 26 కులాలను బీసీ జాబితాలో కొనసాగించాలి. బీజేపీ అధికారంలోకి రాగానే ఆ 26 కులాలను తిరిగి బీసీల్లో చేర్చుతాం. ఈ 26 కులాలను ప్రభుత్వం బీసీ జాబితాలోకి చేర్చేవరకు బీజేపీ పోరాటం ఆగదు” అని ఎంపీ లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version