టీడీపీ-జనసేనతోనే రాజుగారి ఫ్యూచర్…!

-

గత మూడేళ్లుగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు..ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గానే ఉంటున్నారు. ఎప్పుడైతే ఆయన..సొంత పార్టీపైనే వ్యతిరేకంగా గళం విప్పడం మొదలుపెట్టారో అప్పటినుంచి రాజు గారు రెబల్ గా మారిపోయారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై రఘురామ నిత్యం విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇలా విమర్శలు చేస్తున్న రఘురామకు చెక్ పెట్టడమే లక్ష్యంగా వైసీపీ కూడా ఎలాంటి రాజకీయాలు చేసిందో అందరికీ తెలిసిందే.

అయినా సరే రఘురామ వెనక్కి తగ్గకుండా ఢిల్లీలో ఉంటూ..ప్రతిరోజూ మీడియా సమావేశం పెడుతూ..వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అలాగే ఈయన కూడా సొంతంగా సర్వేలు చేయిస్తూ ముందుకెళుతున్నారు. నెక్స్ట్ జగన్‌ని గద్దె దించడానికి రఘురామ కూడా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే..నెక్స్ట్ రఘురామ పోలిటికల్ ఫ్యూచర్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే..ఆయన ఈ సారి ఏ పార్టీలోకి వెళ్తారు? ఏ సీటులో పోటీ చేస్తారనే విషయంపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. వైసీపీపై తిరుగుబాటు చేసిన రఘురామ టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది.

కొన్నిసార్లు మాత్రం బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం వచ్చింది. కానీ ఆయన ఏ పార్టీలో చేరలేదు. ఎన్నికల ముందే పార్టీ చేరికపై నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. మళ్ళీ వైసీపీలో పోటీ చేసే ఛాన్స్ ఏ మాత్రం లేదు. దీంతో టీడీపీ-జనసేన-బీజేపీ..ఈ మూడు పార్టీల్లో ఒక పార్టీలో చేరాలి. కానీ ఎందులో చేరిన..ఈయన గాని మళ్ళీ నరసాపురంలో పోటీ చేస్తే ఖచ్చితంగా టీడీపీ-జనసేన పొత్తు ఉండాలసిందే. అప్పుడే గెలవగలుగుతారు.

ఇక ఈయన కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అక్కడ గెలవాలన్న సరే టీడీపీ-జనసేన పొత్తు ఉండాల్సిందే. అంటే టీడీపీ-జనసేనతోనే రాజుగారి రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. అలాగే ఈయన ఈ రెండు పార్టీల్లో ఎందులో చేరతారు..లేదా బీజేపీ కూడా పొత్తులో ఉంటే ఆ పార్టీలో చేరి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. అలాగే తన సొంత స్థానం నరసాపురం మాత్రం రాజుగారు వదులుకునేలా లేరు. ఏ పార్టీలో చేరిన ఇక్కడ నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version