ఇష్టమొచ్చినట్లు పిల్లలను కన్న రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెంచుతారట: కేటీఆర్

-

ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశవ్యాప్తంగా 2026లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్లో మాట్లాడుతూ.. ‘మేమిద్దరం.. మాకిద్దరు అని కేంద్రం ఇచ్చిన పిలుపును దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ,బిహార్, రాజస్థాన్ ప్రజలు పట్టించుకోలేదు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్లు పెంచరట. ఇష్టమొచ్చినట్లు పిల్లలను కన్న రాష్ట్రాల్లో పెంచుతారట’ అని మండిపడ్డారు.

దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్. ఉద్యోగులతో పేగు బంధమని చెప్పి అత్యధిక జీతాలు ఇచ్చాం. కానీ జీతాలు ఆలస్యమయ్యాయని వాళ్లు దూరమయ్యారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైన కారణంగా కాస్త జీతాలు ఆలస్యమయ్యాయి. ఐతే వాళ్లందరికీ మనం సరిగా తీరుగా మనం చేసిన పనులను చెప్పుకోలేకపోయాం. గిరిజనుల కోసం కేసీఆర్ గారు తాండాలను పంచాయితీలు చేశారు. 6 శాతం రిజర్వేషన్లు ఇచ్చికున్నాం, సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాం. పోడు భూములను పంచినాం. కొమురం భీమ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసింది కేసీఆర్ గారు. ఇంద్రవెల్లిలో కాల్చి చంపిన కాంగ్రెస్ ప్రభుత్వం…సిగ్గు లేకుండా, మానం లేకుండా మళ్లీ ఇంద్రవెల్లికి వచ్చి గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version