తెలంగాణాలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికలు BRS కు అగ్నిపరీక్ష లాంటిది అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ మరియు ఇతర స్థానిక పార్టీలు కేసీఆర్ ను గద్దె దించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తాజాగా కాంగ్రెస్ మాజీ టీపీసీసీ చీఫ్ మరియు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం అమలు చేస్తున్న వైద్య సేవల విషయంలో పూర్తిగా విఫలం అయిందంటూ విమర్శించారు. మేము కనుక అధికారంలోకి వస్తే ఒకటవ తేదీనే జీతాలను చెల్లిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల గురించి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ స్థానాలలో గెలిచి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
ఇక ఒకవైపు కేసీఆర్ మాదే విజయమంటూ రంకెలేస్తుంటే, కాంగ్రెస్ లేదు మాదే విజయం అంటోంది మరి ఎవరు గెలుస్తారు అన్నది తెలియాలంటే ఇంకో నెల ఆగాల్సిందే.