రాష్ట్రంలో 80శాతం మంది కౌలు రైతులు చనిపోతున్నారు : ఉత్తమ్‌

-

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఒక రాజకీయ నాయకుడే కాదు గొప్ప మానవతావాది అని అన్నారు. ప్రతి రోజు వివిధ వర్గాల సమస్యలు తెలుసుకొని రాబోయే రోజుల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రైతు స్వరాజ్య వేదిక ద్వారా రైతులను కలిసిన రాహుల్ గాంధీ..రేపు చేనేత, పోడు భూములను సేద్యం చేసుకుంటున్న వారి సమస్యలను తెలుసుకుంటారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ లో 25లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతుందని..2011 కౌలు రైతుల చట్టాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో 80శాతం మంది కౌలు రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు పంటల బీమా ఇవ్వడం లేదన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పంట నష్టపరిహారం కింద వారికి ఎలాంటి సహాయం చేయడం లేదని చెప్పారు. పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధరణి పోర్టల్ అవకతవకలపై కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version