మృగశిర కార్తె వచ్చిందంటే చాలు చేప మందు కోసం జనాలు ఎకగబడుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో బత్తిని సోదరులు చేప మందును పంపిణీ చేస్తుంటారు. అయితే.. కరోనా నేపథ్యంలో గత మూడు సంవత్సరాలుగా చేప మందు పంపిణి నిలిపివేశారు. అయితే.. చేప మందు ద్వారానే కాకుండా.. మృగశిర కార్తె రోజు చేపలను వండుకుంటుంటారు. తొలిరోజు రోజు చేపలకు యమ గిరాకీ ఉంటుంది.
ఏ మార్కెట్ చూసినా… రద్దీగా కనిపిస్తుంటాయి. ప్రతి పల్లెలోని చెరువుల వద్ద సందడి కనిపించే దృశ్యాలు దర్శనమిస్తుంటాయి. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన మృగశిర కార్తె 15 రోజుల పాటు ఉంటుంది. తొలిరోజు ప్రజలు చేపలు తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ పద్ధతి ఆనాదిగా వస్తోంది. చేపలు తింటే.. వ్యాధులు దూరమవుతాయనేది ప్రజల బలమైన నమ్మకం. దీనికి ఓ కారణం ఉందడోయ్..! ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుందని చెబుతుంటారు.