ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.అయితే.. 158 లక్ష్య ఛేదనకు దిగిన చైన్నై సూపర్ కింగ్స్ 18 ఓవర్లకే విజయం తీరాలకు చేరుకున్నారు.
ఐపీఎల్ హిస్టరీలో రెండో వేగవంతమైన హాఫ్ సంచరీ రికార్డు మొయిన్ ఆలీ పేరిట ఉండగా.. దానిని అజింక్యా రహానే సమం చేశాడు. చెన్నై, ముంబై మధ్య జరుతున్న మ్యాచ్‌లో వన్ డౌన్‌గా దిగిన రహానే 19 బంతుల్లోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే… ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యాడు. నిన్నటి మ్యాచ్ లో సూర్య… కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. అయితే.. సూర్య విఫలం కావడంతో ధోని అతనికి క్లాస్ తీసుకున్నాడు. బ్యాటింగ్ టిప్స్ చెబుతూ.. స్పెషల్ క్లాస్ ఇచ్చాడు ధోని.