ఇండియా క్రికెట్ లో సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రావిడ్ ల శకం తర్వాత దొరికిన ఆణిముత్యాల్లాంటి క్రికెటర్ లలో ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి వారు ముందుంటారు. జార్ఖండ్ నుండి వచ్చిన ఇండియా క్రికెట్ ను చాలా కాలం పాటు ఏలిన మహేంద్రుడు ఎన్నో చిరస్మరణీయ విజయాలను మరియు ట్రోఫీలను అందించాడు. ముఖ్యంగా కపిల్ దేవ్ తర్వాత ఇండియా కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా చరిత్రలో మిగిలిపోయాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.. ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ ట్రోపీని అందించాడు. ఇక తాజాగా ఒక న్యూస్ ధోని గురించి సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. ఝార్ఖండ్ లోని రాంచి లో తనకు చాలా ఇష్టమైన యమహా RD 350 బైక్ పై అలా చక్కర్లు కొడుతూ ఉంటే, అటుగా వెళ్తున్న సమయంలో రాంచీలో ఒక యంగ్ క్రికెటర్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడని గుర్తించి తానే బైక్ ను ఆపి అతన్ని ఎక్కించుకుని తాను వెళ్లాల్సిన ప్రదేశానికి చేర్చాడట.
ఈ విషయాన్నీ ఆ కుర్రాడు ఎంతో సంతోషంగా తన సోషల్ మీడియా లో షేర్ చేశాడు.