గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫొన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్‌ను పాస్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఈ విషయాన్ని తాజాగా హైదరాబాద్ పోలీసులకు అధికారులువ సమాచారం ఇచ్చారు.ఈ కేసులో ప్రభాకర్ రావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.ఈ కేసు విచారణలో భాగంగా అతన్ని ఇండియాకు తిరిగి తీసుకురావడానికి తెలంగాణ పోలీసులు ఇంటర్‌పోల్ సాయం తీసుకుంటున్నారు.తాజాగా ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ఉంటున్న ఆయనకు గ్రీన్ కార్డు నిరాకరించినట్లు సమాచారం.అమెరికా కాన్సులేట్,కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు కేసు విచారణలో వేగం పెంచారు.