అంబానీయే నంబర్ వన్.. ఇండియాలో అగ్రస్థానంలో రిలయన్స్

-

రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి నంబర్ వన్ అని ప్రూవ్ చేసుకున్నాయి. ఇండియాలో నంబర్ వన్​గా మరోసారి స్థానం దక్కించుకున్న రిలయన్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20వ స్థానంలో నిలిచింది. భారత్‌లో ఉద్యోగులు పనిచేయడానికి అత్యుత్తమ సంస్థగా ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. ఆదాయాలు, లాభాలు, మార్కెట్‌ విలువ పరంగా దేశంలో అతిపెద్ద సంస్థగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉంది.

ఫోర్బ్స్‌ వరల్డ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్స్‌ ర్యాంకింగ్స్‌ 2022 ప్రకారం.. ఇండియాలో తొలిస్థానంలో ఉన్న రిలయన్స్‌, ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచింది. ఒక భారత సంస్థకు ఇదే అత్యుత్తమ ర్యాంకు. 800 కంపెనీలతో రూపొందించిన ఈ జాబితా అగ్రస్థానంలో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ నిలిచింది. తర్వాతి స్థానాలను అమెరికా సంస్థలు మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), యాపిల్‌ దక్కించుకున్నాయి. అమెరికా కంపెనీలే రెండు నుంచి పన్నెండు స్థానాలను పొందాయి. జర్మనీ వాహన దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్‌ 13వ స్థానంలో ఉంది. ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 14, ఫ్రాన్స్‌ సంస్థ డెకాథ్లాన్‌ 15వ స్థానాల్లో నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version