ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానానికి చేరుకున్న ముఖేశ్ అంబానీ..!

-

భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరో మైలురాయిని అధిగమించారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 80.6 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముఖేశ్ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

ఈ జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 187 బిలియన్ డాలర్లతో తొలి స్థానంలో ఉన్నారు. తర్వాత 121 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ 2వ, 102 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్ బర్గ్ 3వ స్థానాల్లో ఉన్నారు. ఇప్పటికే వారెన్ బఫెట్, ల్యారీ పేజ్, ఎలాన్ మస్క్ వంటి కుబేరులను ముఖేశ్ అధిగమించారు. కాగా తాజాగా.. లగ్జరీ వస్తువులను ఉత్పత్తి చేసే ఎల్వీఎంహెచ్ సంస్ష ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను ఆయన అధిగమించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version