ముంబై లో హై అలెర్ట్.. ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర భారీ భద్రత..!

-

ముంబై హై అలెర్ట్ అయ్యింది. పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముఖేష్ అంబాని ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ముఖేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. క్యాబ్ లో వచ్చిన ఇద్దరు ముఖేష్ అంబాని ఇళ్లు ఎక్కడా అని డ్రైవర్ ని అడగడం.. రెండు బ్యాగులు కలిగి ఉండటంతో అనుమానాలు పెరిగాయి. ఆంటిలియా గురించి ఇద్దరు వ్యక్తులు అడిగారని.. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంలో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. క్యాబ్ లో వచ్చిన అనుమానితుల కోసం సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. డీసీపీ ర్యాంకు అధికారి ప్రస్తుతం భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

గతంలో ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బ్లాక్ స్కార్పియో లో పేలుడు పదార్థాలను పోలీాసులు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి ముఖేష్ అంబానికి విస్త్రుతమైన భద్రత కల్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version