ఐపీఎల్ 2023 :చెన్నై ముందు 158 పరుగుల స్వల్ప లక్ష్యం.. !

-

వాస్తవంగా ముంబై ఇండియన్స్ పవర్ ప్లే లో ఆడిన విధానాన్ని చూస్తే చెన్నై ముందు ఛాలెంజింగ్ టోటల్ తప్పదు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ముంబై ఆటగాళ్లు క్రీజులో నిలబడడానికి భయపడ్డారు అని చెప్పాలి. చెన్నై స్పిన్ ద్వయం జడేజా మరియు మిచెల్ లు కట్టుదిట్టమైన లెంగ్త్ తో బంతులను సంధిస్తూ ముంబై జోరుకు బ్రేకులు వేశారు. ఇషాన్ కిషన్ తర్వాత ఎవ్వరూ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు, ఆఖర్లో డేవిడ్ మరియు షోకీన్ ల చిన్న ఇన్నింగ్స్ ల వలన ఎలాగోలా పడుతూ లేస్తూ నిర్ణీత ఓవర్ లలో ముంబై 157 పరుగులను సాధించింది.

డేవిడ్ కనుక ఆఖరి మూడు ఓవర్లు ఉండి ఉంటే ఖచ్చితంగా జట్టు స్కోర్ 175 రీచ్ అయ్యేది. అయినా ముంబైకి ఉన్న బౌలింగ్ వనరులను సరిగా వాడుకుంటే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. మరి చూద్దాం ఏమి జరుగుతుందో ?

Read more RELATED
Recommended to you

Exit mobile version