బీజేపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసింది : ఖర్గే

-

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే తొలి ప్రసంగంలోనే బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తన బూటకపు మాటలతో దేశ ప్రజలందరినీ ఫూల్స్ చేయగలదేమో కానీ హిమాచల్ ప్రదేశ్ ప్రజలను మాత్రం ఫూల్స్ చేయలేదని పేర్కొన్నారు. బనుటి బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, హిమాచల్ ప్రజలు బాగా చదువుకున్న వారని, ప్రతీ విషయాన్ని అర్ధం చేసుకోగలరని, ఓటింగ్ సమయంలో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు ఆయన. ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని, ఉద్యోగాలిస్తామనే బూటకపు వాగ్దానాలతో బీజేపీ అందర్నీ నమ్మించినా ఇక్కడి ప్రజలు మాత్రం మోసపోవడానికి సిద్ధంగా లేరని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ తరచు ఆడిపోసుకుంటుందని, హిమాచల్ ప్రదేశ్‌లో రోడ్లు, పాఠశాలలు సహా అన్ని సౌకర్యాలు కాంగ్రెస్ హయాంలోనే కల్పించామని, బీజేపీ ఏడేళ్లలో చేసినదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో ఆ హామీలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటగా పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తుందని భరోసా ఇచ్చారు. 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.600 కోట్లతో స్టార్టఫ్ ఫండ్ ఏర్పాటు, లక్ష ఉద్యోగాల కల్పన, 18 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రతినెలా రూ.1.500 సహాయం అందిస్తామని పేర్కొన్నారు ఖర్గే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version