బిగ్ బ్రేకింగ్ : వైఎస్ అనుచరుడు సూరీడు మీద మర్డర్ అటెంప్ట్

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు సూరీడు మీద దాడి జరిగింది. జూబ్లీహిల్స్ లోని అతని నివాసం లోపలికి బలవంతంగా ప్రవేశించి సూరీడు అల్లుడు  డా. సురేంద్ర నాథ్ రెడ్డి క్రికెట్ బ్యాట్ తో దాడి చేసి హత్యయత్నం చేసినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా సూరీడు మీద  సురేంద్ర నాథ్ రెడ్డి దాడి చేసినట్లు చెబుతున్నారు. సూరీడు కూతురిని వేధింపులకు గురి చేస్తుండడంతో గతంలో సురేంద్రనాథ్ రెడ్డి మీద గృహ హింస కేసు పెట్టారు.

అయితే ఆ కేసులు ఉపసంహరణ చేసుకోవడం లేదనే కక్ష్యతో మామ సూరీడు ను హత్య చేసేందుకు సురేంద్ర నాథ్ రెడ్డి యత్నించాడని చెబుతున్నారు. సూరీడు కుమార్తె గంగా భవాని  ఫిర్యాదుతో హత్యా యత్నం కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు సురేంద్ర నాథ్ రెడ్డిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వైఎస్ చనిపోయిన నాటి నుంచి బయట పెద్దగా కనిపించడం మానేసిన సూరీడు ఆ మధ్య రేవంత్ రెడ్డి నిర్వహించిన ఒక సభలో మెరిసారు. ఆ తరువాత మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version