కేపీహెచ్బీలో దారుణం.. దంపతులు దారుణహత్య

-

హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో దారుణం జరిగింది. దంపతులపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన చోటు చోటు చేసుకుంది. అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు అతి కిరాతకంగా ఇరువురిని హత్య చేశారు. కేపీహెచ్బీ కాలనీ 6 ఫేజ్లో నివాసం ఉంటున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పటించినట్లు తెలుస్తోంది. అయితే అల్లుడే దారుణానికి ఒడిగట్టాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అల్లుడి వేధింపులపై దంపతులు ఫిర్యాదు చేశారు. దంపతుల కుమార్తెను సాయిక్రిష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం నుంచి కుమార్తెను సాయిక్రిష్ణ వేధిస్తున్నారు. వేధింపులపై దంపతులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోనే అల్లుడు సాయిక్రిష్ణ ఈ ఘాతుకానికి ఒడిగట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version