నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం.. బాధ తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య..!

-

అహ్మదాబాద్: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసిన దారుణ ఘటన గుజరాత్‌లోని నరోలి ప్రాంతంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ కిరాతకుడు నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాడు. అనంతరం ఆ పాప మృతదేహాన్ని బ్యాగులో పెట్టి బాత్‌రూం కిటికీలో నుంచి బయట పడేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చిన్నారి-అత్యాచారం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని దాద్రానగర్ హవేలీ, నరోలి గ్రామ సొసైటీలో చిన్నారి కుటుంబం నివాసముంటోంది. ఆడుకోవడానికి బయటికి వెళ్లిన చిన్నారి రాత్రైనా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. ఆ గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టగా… ఓ అపార్ట్‌మెంట్ టాయిలెట్ పక్కనే ఓ బ్యాగును గుర్తించారు. పోలీసులు బ్యాగు దగ్గరికి వెళ్లి తెరిచి చూడగా.. అందులో పాప మృతదేహం కనిపించింది. దీంతో ఆ సొసైటీలో ఉన్న 40 ప్లాట్లలో తనిఖీలు నిర్వహించారు.

ప్లాట్ నంబర్.109లోని బాత్‌రూంలో రక్తపు మరకలు కనిపించాయి. బాత్‌రూం కిటికీ కూడా పగిలి ఉండటంతో పోలీసులు అందులో నివసిస్తున్న యువకుడి అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే, పాపను ఇంటికి తీసుకొచ్చి అత్యాచారం చేసినట్లు.. చిన్నారి స్పృహ కోల్పోతే భయం వేసి చంపేశానని, ఎవరి కంట పడకుండా బ్యాగ్‌లో పాప మృతదేహాన్ని వేసి కిటికీలోంచి పడేశానని నిందితుడు సంతోష్ రజత్ తెలిపాడు. ఆ మాటలు విన్న పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ దారుణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఫినాయిల్ తాగడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా, పరిస్థితి విషమించడంతో చిన్నారి తండ్రి కూడా ప్రాణాలు విడిచాడు. తండ్రికూతురి మరణంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version