దారుణ హత్య..బండరాయితో కొట్టి..!

-

గోల్కండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలిజాపుర్ రహదారి వద్ద రాహుల్ చంద్ అగర్వాల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రహుల్ చంద్ ను గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్ళతో మోది హత్య చేసినట్లు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేపట్టారు.  రాహుల్ చంద్ మల్లేపల్లి నివాసితుడని, పక్కనే పడి ఉన్న అతని ద్విచక్ర వాహనంలో దొరికిన బ్యాంక్ పాస్ బుక్ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు పశ్చిమ మండలం డీసీపీ ఏ.ఆర్ శ్రీనివాస్ తెలిపారు. మజ్హార్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాతమిక దర్యాప్తులో తెలిసిందని. వీరిద్దరూ స్నేహితులని, పైగా ఒకే ప్రాంతానికి చెందినవారని తెలిపారు. అయితే మజ్హర్ దొరికితే హత్యకు గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితుడిని త్వరలోనే పట్టకుంటామని డీసీపీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version