నేటి నుంచే మూసీ పునరుజ్జీవన పథకం ప‌నులు ప్రారంభం

-

మూసీ పునరుజ్జీవన పథకంలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. నేటి నుంచే మూసీ పునరుజ్జీవన పథకం ప‌నులు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే… గోదావరి ఫేజ్-2, ఫేజ్-3 పనులకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ త‌రుణంలోనే.. 20 టీఎంసీల నీరు మల్లన్నసాగర్ నుంచి తరలించ‌నున్నారు.

cm revanth musi
Musi revitalization project begins today

రూ.7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ త‌రుణంలోనే… గండిపేట వద్ద ఉన్న గోల్కొండ రిసార్ట్స్ వద్ద భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 జలాశయాలను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news