ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త అందించింది. కడప – విశాఖపట్నం మధ్య నేరుగా ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్ధమైంది. ఈ మార్గంలో ఇందిరా ఏసీ బస్సులు నడపబోతున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. బస్సులు విశాఖపట్నం నుంచి కడపకు వెళ్తూ అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, మిడుపూరు వంటి ప్రధాన పట్టణాలను దాటుతాయి. ఈ క్రమంలో ప్రయాణికులు ఒక్కసారిగా అనేక కీలక నగరాలను టచ్ చేస్తూ సౌకర్యవంతమైన ప్రయాణం చేయగలుగుతారు.

ఆర్టీసీ తెలిపిన వివరాల ప్రకారం… ఈ బస్సులు విజయవాడ మార్గం గుండా నడుస్తాయి. ప్రత్యేకంగా దీర్ఘదూర ప్రయాణికుల కోసం సౌకర్యవంతమైన ఇందిరా ఏసీ బస్సులు నడపనున్నారు.టికెట్లు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న విశాఖ–కడప ప్రయాణికులకు ఈ బస్సులు కొత్త సౌకర్యాన్ని అందించనున్నాయి. దీంతో చదువుల కోసం, ఉద్యోగాల కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇకపై నేరుగా, సౌకర్యవంతంగా వెళ్లే అవకాశం కలుగనుంది.