రెండు తెలుగు రాష్ట్రాలలో ఉల్లిపాయల ధరలు.. భారీగా తగ్గిపోయాయి. దీంతో ఉల్లి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు భారీగా ధర ఉన్న ఉల్లి ధర ఒకసారిగా పడిపోవడంతో… ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉల్లి రైతులు. తెలంగాణ రాష్ట్రంలో కిలో ఉల్లిగడ్డ ధర ఐదు రూపాయలు నుంచి 16 రూపాయలకు మాత్రమే లభిస్తోంది.

అయితే వినియోగదారులకు వచ్చేసరికి 25 రూపాయల నుంచి 45 రూపాయలు… పలుకుతోంది ఉల్లిగడ్డ. ఫలితంగా మధ్యవర్తులే ఈ ఉల్లిగడ్డ ద్వారా… లాభపడుతున్నారు. రైతులు అలాగే సామాన్య ప్రజలు మాత్రం నష్టపోతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వింటాల్ కనిష్టంగా 500 ఒక రూపాయలు ఉండగా గరిష్టంగా 1249 రూపాయలు ఉంది. అంటే రైతుకు కిలో కు ఐదు రూపాయల నుంచి 12 రూపాయలు మాత్రమే వస్తోంది. గత కొన్ని రోజులుగా మార్కెట్లలో ఉల్లిగడ్డ పేరుకుపోయి ఉంది. అందుకే రైతులకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు.
రైతుల డిమాండ్లు
కనీస మద్దతు ధర (MSP)ను పెంచాలని కోరుతున్నారు. మార్కెట్లలో నిల్వ సదుపాయాలు కల్పించాలని సూచిస్తున్నారు. మధ్యవర్తుల దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.