ముస్లిం మహిళలు ఎక్కడైనా విడాకులు తీసుకోవచ్చు : కేరళ హైకోర్టు

-

దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న నిర్ణయాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది. కోర్టు ప్రక్రియ ద్వారా ముస్లిం మహిళలకు ప్రత్యేక విడాకులు ఇచ్చే హక్కును పునరుద్ధరించింది. పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు తుది నిర్ణయాన్ని వెల్లడించింది. కుటుంబ న్యాయస్థానాల్లో దాఖలు చేసిన పిటిషన్లు ప్రత్యేక పిటిషన్ ద్వారా విడాకులు పొందే హక్కును కల్పించాలని కోరాయి. కానీ, 1972లో ఈ నిర్ణయాన్ని ధర్మాసనం రద్దు చేసింది. ముస్లిం మహిళలకు కేవలం న్యాయ ప్రక్రియతోనే విడాకులు లభిస్తాయని, ఇతర మార్గాల ద్వారా విడాకులు పొందే అవకాశం లేదని తీర్పు వెలువరించింది. అయితే, ప్రస్తుతం విడాకుల విషయంలో పురుషులతోపాటు స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయని హైకోర్టు తీర్పునిచ్చింది. కేరళ రాష్ట్రంలో.. కేసీ.మొయిన్-వీ.నఫీసా, ఇతరుల కేసులు పరిగణించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పులో ముస్లిం వివాహ చట్టం-1939ను రద్దు చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని.. ముస్లిం మహిళలకు న్యాయ ప్రక్రియ ద్వారా విడాకులు అందించే ప్రక్రియను విస్మరించబడింది.

ముస్లిం మహిళలు

ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముస్లిం వివాహం.. చట్టపరమైన ప్రక్రియ నుంచి వేరు చేయబడదని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు చట్టపరమైన వివాహన్ని రద్దు చేయడంపై జస్టిస్ ఏఎం.మహ్మద్ మష్తాక్, జస్టిస్ సీఎస్ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ కేరళ హైకోర్టు తన తీర్పును మార్చలేదు. షరియా చట్టం, ముస్లిం నిఖా నిర్మూలన చట్టం యొక్క విశ్లేషణ తర్వాత.. ముస్లిం మహిళలు కోర్టు జోక్యం లేకుండానే విడాకులు తీసుకోవచ్చని తెలిపింది. షరియా చట్టం నిబంధన-2లో పేర్కొన్న అన్ని విడాకుల పద్ధతులు ఇప్పుడు ముస్లిం మహిళలకు అందుబాటులో ఉన్నాయని హైకోర్టు వెల్లడించింది. ఇకపై ముస్లిం మహిళలు ప్రత్యేక న్యాయ చట్టం ద్వారా విడాకాలు తీసుకునే హక్కు లేదని, షరియా చట్టం, ముస్లిం నిఖా నిర్మూలన చట్టం ద్వారా కూడా విడాకులు పొందవచ్చని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version