కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల డీఎంహెచ్వోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆళ్ల నాని. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కృష్ణా, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని సూచనలు చేశారు. రానున్న ఆరు వారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
అలానే వైరస్ వ్యాప్తి గతానికంటే వేగంగా ఉందన్న మంత్రి ఆళ్ల నాని, ఆస్పత్రుల్లో బెడ్స్ సిద్ధం చేశాలు డీఎంహెచ్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరులో నిన్న ఒక్కసారి 40 కేసులు నమోదు కావడం ప్రమాదకరమన్న మంత్రి ఆళ్ల నాని కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణలో కూడా పడి బెద్స్ కి పైన ఉన్న అన్ని ఆసుపత్రులలో కరోనా చికిత్స అందించాలని జారీ చేసిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఏమవుతుంది అనేది.