12సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళా ఈనెల 13 నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రారంభం కానుంది. అందుకోసం యూపీ సర్కార్ పెద్దఎత్తున ఏర్పాట్లను చేసింది. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడంతో వేల మంది పోలీసులతో పెద్దఎత్తున రక్షణ ఏర్పాట్లను పరిశీలిస్తున్నది.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు యూపీ సర్కార్ ఆహ్వానం పంపింది. ఆదివారం యూపీ కార్మిక మంత్రి అనిల్ రాజ్‌భర్బ్‌జెపి తెలంగాణకు విచ్చేసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ను కలిశారు. మహా కుంభమేళాకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందించారు.ఈ వివరాలను కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.