వానాకాలంలో కొత్తిమీర ని పక్కా తినండి.. ఎందుకంటే..?

-

చాలా మంది కొత్తిమీరని వంటల్లో వాడుతూ ఉంటారు కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది వంటల్లో కొత్తిమీరని ఉపయోగించడం వలన మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా కొత్తిమీర బాగా హెల్ప్ అవుతుంది. కొత్తిమీర వలన ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. గుండెపోటు పక్షవాతం వంటివి కొత్తిమీర తగ్గించగలదు. అధిక రక్తపోటుని కూడా తగ్గించే గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి. కొత్తిమీరలో విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. అలానే యాంటీ సెప్టిక్ లక్షణాలు కూడా కొత్తిమీరలో ఉంటాయి.

కొత్తిమీరని తీసుకుంటే నోటిలో పుండ్లు పడడం వంటి బాధలు ఉండవు. అల్సర్ కూడా రాదు అంతేకాదు కొత్తిమీరని తీసుకుంటే అజీర్తి వికారం వంటివి తగ్గుతాయి. వర్షా కాలంలో కొత్తిమీర బాగా దొరుకుతుంది ధర కూడా బాగా తక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో కొత్తిమీరను తీసుకుంటే ఇటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి. కొత్తిమీరతో రుచిగా పచ్చడి వంటివి కూడా చేసుకుని తీసుకోవచ్చు.

ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉపయోగాలు కొత్తిమీరతో పొందొచ్చు కాబట్టి కొత్తిమీరని బాగా వాడుతూ ఉండండి. అప్పుడు ఈ సమస్యలు అన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చు. కొత్తిమీర లేకుండా చాలామంది వంట చేయడానికి ఇష్టపడరు. మంచి ఫ్లేవర్ కొత్తిమీరలో ఉంటుందని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొత్తిమీరను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఫ్లేవర్ తో పాటుగా ఎన్ని రకాల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కాబట్టి కొత్తిమీరని ఎక్కువగా ఉపయోగించండి అప్పుడు ఈ అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version